వారిపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ దీక్ష
శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో దేవత విగ్రహాలు ధ్వంసం చేసిన ముఠాను అరెస్టు చేయాలన్నారు. వారి ఇళ్లు జప్తు చేసి కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. చర్యలు తీసుకోకపోతే రోడ్డుపై ఆమరణ దీక్షకు దిగుతామని సృష్టం చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తికి.. దేవతల విగ్రహాలు మాత్రమే ధ్వసం చేయాలని అనిపించిందా? రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కనబడలేదా? అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. ఇవాళ విగ్రహాలే కదా అని వదిలేస్తే.. రేపు హిందువుల ఇళ్లల్లో చొరబడి విధ్వంసాలు సృష్టిస్తారని పేర్కొన్నారు.













