సార్క్ సదస్సుకు సుష్మా స్వరాజ్
న్యూయార్క్‌లో జరగనున్న సార్క్ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరుకానున్నారు. విదేశీ మంత్రులతో కూడిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యుఎన్సిఎ) చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సదస్సులో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షామహ్మద్ ఖుర్షీ కూడా పాల్గొననున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖుర్షీ ఇద్దరూ స్నేహసంబంధాలపై చర్చించనున్నట్లు పాకిస్థాన్ విదేశీ వ్వవహారాల మంత్రిత్వశాఖ మంత్రి మహ్మద్ ఫైసల్ ఇస్లామాబాద్‌లో ప్రకటించారు. వచ్చే వారం సుష్మాస్వరాజ్, ఖుర్షీలు న్యూయార్క్‌లో యుఎన్జిఓ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు.













