నా జీవితంలో ఎదురుచూసిన రోజు!
నా జీవితంలో ఎదురుచూసిన రోజు.. ఇది సుష్మా స్వరాజ్ ఆఖరి ట్వీట్లో మాట. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం రాత్రి 7:23 గంటలకు ఆమె ఈ ట్వీట్ చేశారు. తర్వాత కొన్ని గంటలకే ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. నరేంద్ర మోదీ జీ థాంక్యూ ప్రైమ్ మినిస్టర్. థ్యాంకూ వెరీ మచ్. ఈ రోజు కోసమే నా జీవితంలో ఎదురుచూస్తున్నా అని ఉద్వేగంతో ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేసే ప్రక్రియ ముగియడంతో ట్విటర్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. కొన్ని గంటలు గడిచాయే లేదో ఆమె ఇక లేరన్న చేదు నిజంతో బీజేపీ శ్రేణులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.













