ఎక్కడి నుంచైనా పాస్ పోర్టు దరఖాస్తు
పాస్‌పోర్టు సేవలను మరింత సరళతరం, వినియోగదారులకు మరింత చేరువ చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పాస్‌పోర్టు సేవా దివస్‌ను పురస్కరించుకుని కొత్త యాప్ మొబైల్ పాస్‌పోర్టు అప్లికేషన్ ను విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయంత్రి జనరల్ (విశ్రాంత) వీకే సింగ్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్‌సిన్హా తదితరులు హాజరైనారు. ఇదే విషయాన్ని విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్‌కుమార్ ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ యాప్ సాయంతో ఎవరైనా సరే, దేశంలో ఏ ప్రాంతం నుంచైనా సరే పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లను ఉపయోగించుకుని ఈ యాప్ ద్వారా పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.













