మీరు నా తల్లిలాంటి వాళ్లు!
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు దేశవిదేశాల్లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోతున్నది. ముఖ్యంగా మన దాయాది పాకిస్థాన్‌లోనూ సుష్మాకు అభిమానులు ఎక్కువవుతున్నారు. మొన్నటికి మొన్న మీరు మా ప్రధానిగా ఉంటే బాగుండేదని ఓ పాక్ వ్యక్తి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేన్సర్‌తో బాధపడుతున్న ఓ పాకిస్థాన్ మహిళకు భారత వీసా ఇప్పించారు సుష్మా స్వరాజ్. ఫైజా తన్వీర్ అనే ఆ మహిళ భారత వీసా ఇప్పించాల్సిందిగా సుష్మాకు ట్వీట్ చేశారు. మీరు నా తల్లిలాంటివాళ్లు. భారత్ 70వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో నాకు మెడికల్ వీసా ఇప్పించండి అని ఆమె కోరారు.













