మానస సరోవర్ యాత్ర ప్రారంభం
కైలాస్ మానస సరోవర్ వార్షిక యాత్రను విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జెండా ఊపి ప్రారంభించారు. డిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్లో తొలి బృందాన్ని ఉద్దేశించి అమె మాట్లాడుతూ యాత్రా మార్గాన్ని అపవిత్రం చేయవద్దని హితవు చెప్పారు. ఈ ఏడాది మొత్తం 1430 మంది యాత్రికులు 25 బృందాలుగా యాత్ర కొనసాగిస్తారు. ఇందులో 18 బృందాలు (ఒక్కో బృందంలో 60 మంది ఉంటారు) చాలా కఠినమైన లిపులేఖ్ పాస్ మార్గంలో వెళ్తాయి. మరో ఏడు బృందాలు (ఒక్కో బృందంలో 50 మంది) కొత్తగా ప్రారంభించిన నాథు లా పాస్ మార్గంలో వెళ్తాయి. ఈ యాత్ర నాలుగు నెలల పాటు కొనసాగుతుంది.













