ఆ వార్తల్లో నిజం లేదు : సుష్మా
తనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. తాను ఏపీకి గవర్నర్‌గా నియామకం కానున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తవమని సృష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన అధికార ట్విటర్లో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తారని ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా సుష్మా స్వరాజ్ వస్తారని, తెలంగాణకు నరసింహన్ కొనసాగడం లేదా కొత్తగా మరో సీనియర్ నేతను తీసుకొస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుష్మాస్వరాజ్ గవర్నర్‌గా నియామకంపై క్లారిట్ ఇచ్చారు.













