అరుంధతి రాయ్‌కు సుప్రీంలో వూరట
ప్రసిద్ధ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత అరుంధతిరాయ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్ రాయ్‌కు జారీ చేసిన నేరారోపణ విచారణ నోటీసులను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను సుదీర్ఘ కాలం జైలులో బంధించడం, ఆయనకు బెయిల్ నిరాకరించడంపై రాయ్ స్పందించారు. ఈ క్రమంలో సాయిబాబాపై ఆమె ఓ ఆంగ్ల మ్యాగజైన్లో వ్యాసం రాశారు. దీంతో ఆమెకు బాంబే హైకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. కోర్టుకు ఆమె స్వయంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయించాలని ఆమె కోర్టును కోరింది. కానీ కోర్టు అందుకు తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో గడ్చిరోలి పోలీసులు అరెస్టు చేసిన విషయం నెటిజన్లకు తెలిసిందే.













