సుబ్రహ్మణ్య స్వామికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా నిర్వహణపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. విరాళాలు, కానుకల రూపంలో ఆలయానికి కోట్ల ఆదాయం వస్తున్నా ఆడిటింగ్ సక్రమంగా నిర్వహించడం లేదని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లో పేర్కొన్నారు. దేవస్థానం ఖర్చుల వివరాలు బహిర్గతం చేయడం లేదన్నారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఇది స్థానిక అంశం అయినందువల్ల తాము విచారించలేమని సృష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని సుబ్రహ్మణ్య స్వామికి సూచించింది.













