7న సూపర్ మూన్ దర్శనం
రానున్న పున్నమిరోజు (ఈనెల 7న) చందమామ సూపర్మూన్గా కనిపించనున్నాడు. చంద్రుడు తన కక్ష్యలో తిరిగే క్రమంలో భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు సాధారణం కంటే 7శాతం పెద్దగా, 15 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందుకే ఆ రోజున కనిపించే చందమామను సూపర్మూన్ అని పిలుస్తారు. ఉత్తర అమెరికాలాంటి ప్రాంతాల్లో పింక్మూన్ అని, ఇతర దేశాల్లో స్ప్రౌటింగ్ గ్రాస్ మూన్, ది ఎగ్ మూన్, ద ఫిష్మూన్ అని పిలుస్తుంటారు. కాగా.. భారత్లో సూపర్మూన్ కనిపించకపోవచ్చని, ఈ సారి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భారత్లో సమయం 8వ తేదీ ఉదయం 8:05గా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.













