సుమిత్రా మహాజన్ సంచలన నిర్ణయం
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. వయసు పైబడిన నేతలను లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సుమిత్రా మహాజన్‌కు కూడా టిక్కెట్ ఇవ్వకపోవచ్చనే ఊహానాగాలు బలంగా వినిపించాయి. అయితే ఈ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అభ్యర్థి ప్రకటన విషయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సుమిత్రా మహాజన్ స్వయంగా తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదంటూ తాజా ప్రకటన చేశారు. ఇదే సమయలో ఇండోర్ నుంచి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని అధిష్ఠానాన్ని నిలదీశారు. వెంటనే అభ్యర్థిని ప్రకటించాలని ఆ లేఖలో ఆమె విజ్ఞప్తి చేశారు. 75 ఏళ్ల సుమిత్రా మహాజన్ రికార్డు స్థాయిలో 8 సార్లు లోక్‌సభకు ఎన్నియ్యారు. 1989 నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.













