మిస్ ఇండియా వరల్డ్ గా సుమన్ రావు
మిస్ ఇండియా వరల్డ్ -2019 కిరీటాన్ని రాజస్థాన్ అందగత్తె, ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) విద్యార్థిని సుమన్‌రావు దక్కించుకున్నారు. ముంబయిలో సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్-2019గా నిలిచారు. మిస్ ఇండియా వరల్డ్ కిరీటం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని సుమన్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాలాంటి యువతులు తమ కలల వెంట పరుగులు పెట్టడానికి భయపడాల్సిన పనిలేదు. నా కుటుంబం, స్నేహితులతో ఎప్పుడెప్పుడు సంతోషం పంచుకుందామా అని మనసు ఉవ్విళ్లూరుతోంది అని కిరీటాన్ని దక్కించుకున్న అనంతరం సుమన్‌రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇంజినీర్ శివానీ జాదవ్ మిస్ గ్రాండ్ ఇండియా-2019, బిహార్‌కు చెందిన మేనేజ్మెంట్ విద్యార్థిని శ్రియా శంకర్ మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్-2019 కిరీటాలను దక్కించుకున్నారు.













