హైదరాబాద్ పుదుచ్చేరి మధ్య స్పైస్ జెట్ సేవలు
చిన్న నగరాలకు విమాన సేవలు కల్పించే లక్ష్యంతో కేంద్రం ప్రకటించిన ఉడాన్‌లో భాగంగా స్పైస్‌జెట్ హైదరాబాద్ -పుదుచ్చేరి మార్గంలో కొత్త విమాన సేవలను ప్రారంభించనుంది. ఆగస్టు 16 నుంచి ఈ సర్వీసు ప్రారంభమవుతుంది. 78 సీట్ల విమానం రోజు హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి, ఉదయం 11:20కి పుదుచ్చేరికి చేరుకుంటుంది. టిక్కెట్ ధర రూ.3,040. అక్కడి నుంచి ఉదయం 11:40కి బయలుదేరి మధ్యాహ్నం 1:10కి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. టిక్కెట్ ధర రూ.2,800, టిక్కెట్ల బుకింగ్ ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు.













