విజయవాడ-ముంబై స్పైస్ జెట్ సర్వీస్
విజయవాడ నుంచి ముంబైకి మరో విమాన సర్వీస్ ప్రారంభమవుతోంది. స్పైస్ జెట్ సంస్థ ఆదివారం నుంచి ఈ డెయిలీ సర్వీసు ప్రారంభిస్తోంది. ప్రతి రోజూ స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737/800 విమానం ముంబై నుంచి ఉదయం 11:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు విజయవాడ చేరుతుంది. తిరిగి ఇక్కడి నుంచి మధ్యాహ్నం 1:30 గంటలకు బయలు దేరి సాయంత్రం 4:15 గంటలకు ముంబై చేరుకుంటుంది. 168 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉన్న ఈ విమాన సర్వీస్ కోసం స్పైస్‌జెట్ సంస్థ ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్స్ ప్రారంభించింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ముంబైకి ఇది రెండో విమాన సర్వీసు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే విజయవాడ నుంచి ప్రతి మంగళ, బుధ శనివారాలలో ముంబైకి విమాన సర్వీసులు నడుపుతోంది.













