మహిళా క్రికెటర్లు ఒక్కటయ్యారు!
దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు డేన్‌వాన్ నీకెర్, మారి జెన్ కాప్ పెండ్లి చేసుకున్నారు. సహచర క్రికెటర్లు, కొంత మంది అతిథుల మధ్య నీకెర్క్, కాప్ వివాహ బంధానికి ముడిపడింది. తమ దేశ చట్టాలకు అనుగుణంగా వీరిద్దరు పెండ్లి తంతు పూర్తి చేసుకున్నారు. వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 1993లో ప్రిటోరియాలో జన్మించిన వాన్ నీకెర్క్ దక్షిణాఫ్రికా తరపున ఓ టెస్ట్, 95 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లాడింది. వన్డేల్లో 33.69 సగటుతో నీకెర్క్ 1770 పరుగులతో పాటు 125 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన సఫారీ బౌలర్‌గా కొనసాగుతున్న నీకెర్క్ దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ అవార్డును సొంతం చేసుకున్నది. అయినా మహిళా క్రికెటర్లు పెండ్లి చేసుకోవడం ఇదేం కొత్త కాదు. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాథర్‌వైట్, లీ తుహుహు వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు.













