ప్రపంచవ్యాప్తంగా సీతారాముల కల్యాణోత్సవాలు
జగదానంద కారకుడు రాముడ, జగనాత్మ సీతమ్మకు జరిగే కల్యాణం అంటే అది జగత్కల్యాణమే. ఇలాంటి కల్యాణ మహోత్సవానికి పెట్టింది పేరు భద్రాద్రి పుణ్యక్షేత్రం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా సీతారామ కల్యాణోత్సవాలు నిర్వహించాలనే సమాలోచనలు సాగుతున్నాయి. దేవాదాయ శాఖ తరపున ఇటీవల హైదరాబాద్లో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. ఊరూరా రామ మందిరాలు ఉన్నప్పటికీ భద్రాద్రిలోని సంప్రదాయాలు అంటే దేశ విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎనలేని భక్తి. దీంతో పలు దేశాల్లో భద్రాద్రి సంప్రదాయంలో సీతారాముల కల్యాణం నిర్వహించి రామతత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటాలని భావిస్తున్నారు.
అమెరికా, ఇండోనేషియా, సింగపూర్, కెనడా జర్మనీ, మలేషియా తదితర దేశాల్లో జూన్ 22 నుంచి నెల రోజులపాటు ఈ వేడుకలను జరపాలని ప్రతిపాదించారు. దీనిపై ఇంకా సృష్టత రావాల్సి ఉంది. అర్చకులలో పాస్పోర్టుతో పాటు వీసా ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.













