సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారం ఏచూరి
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఈ నెల 18న ప్రారంభమైన 22వ జాతీయ మహాసభలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు రోజున కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకొన్నారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ మహాసభలో మొదటిసారిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరి, ప్రస్తుత మహాసభల్లో తిరిగి ఎన్నికయ్యారు. 17 మందితో పొలిట్‌బ్యూరోను, 95 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. పొలిట్‌బ్యూరోలో ఇద్దరికి, కేంద్ర కమిటీలో 20 మందికి కొత్తగా అవకాశమిచ్చారు.













