కొత్త వివాదంలో షిరిడి సాయిబాబ ఆలయం..
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిరిడీ ఆలయం మూసివేత వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆదివారం నుంచి నిరవధికంగా మూసి వేస్తున్నామని ఆలయ ట్రస్టు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే షిరిడీ ఆలయాన్ని మూసి వేయడం ఏంటా అన్న ఆందోళనలు అందరి లోనూ నెలకొన్నాయి. ఈ వార్తలపై ఆలయ ట్రస్టు తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై శనివారం షిరిడీ గ్రామస్థులతో చర్చిస్తామని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ట్రస్ట్ పేర్కొంది.
సాయిబాబా జన్మ స్థలమైన పత్రిని వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తలు షిరిడీ గ్రామంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నిర్ణయంపై షిరిడీ ఆలయ ట్రస్టు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. పత్రిలో బాబా పుట్టినట్టు ఎలాంటి ఆధారాలు లేవని.. ప్రభుత్వం అలా ఎలా నిర్ణయం తీసకుంటుందని ప్రశ్నించింది. ప్రభుత్వం నిర్ణయం పూర్తి స్థాయిలో రావలసి ఉందని.. అప్పుడు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది.
సాయిబాబా జన్మస్థలం పాత్రి అని దానికి 100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని మహారాష్ట్ర సీఎం థాక్రే ప్రకటన.. రేపు షిర్డీ ఆలయం మూసి వేయాలన్న ఆలోచనలో షిరిడి ఆలయ సంస్థాన్..













