షిర్డీ వెళ్లే భక్తులకు శుభవార్త
షిర్డీ వెళ్లే భక్తులకు శుభవార్త. సాయిబాబా దర్శనం చేసుకోవాలంటే గతంలో రైలు, బస్సు, ప్రైవేటు వాహనాల్లో షిర్డీకి వెళ్లాల్సి వచ్చేది. కానీ త్వరలోనే విమానంలోనూ షిర్డీకి వెళ్లొచ్చు. సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) షిర్డీ ఎయిర్‌పోర్టుకు లైసెన్సు మంజూరు చేసింది. ఎయిర్‌బస్ ఏ-320, బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అవసరమైనంత రన్‌వే ఉందని డీజీసీఏ తెలిపింది. రోజువారీ కార్యక్రమాల కోసం ప్రజల కోసం షిర్డీ ఎయిర్‌పోర్టుకు ఏరోడ్రాం లైసెన్స్ మంజూరు చేస్తున్నట్లు సీనియర్ డీజీసీఏ అధికారి తెలిపారు. షిర్డీ పట్టణానికి నైరుతి దిశలో 14 కిమీ దూరంలో కాక్డీ గ్రామంలో రూ.350 కోట్ల వ్యయంతో, 400 హెక్టార్లలో విమానాశ్రయాన్ని నిర్మించారు. దీని యాజమాన్య బాధ్యతలను మహారాష్ట్ర విమానయాన సంస్థ చూసుకుంటుంది. విమానాశ్రయం ఏర్పాటుతో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.













