సుప్రీం సంచలన తీర్పు… అది నేరమే!
మైనర్లతో వివాహంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికతో శారీరక సంబంధం అత్యాచారం కిందకి వస్తుందని సృష్టం చేసింది. 15 నుంచి 18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో శారీరక సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఇలాంటి కేసుల్లో 15 నుంచి 18 ఏళ్ల లోపు వివాహిత బాలికలను మినహాయించడం రాజ్యాంగబద్దం కాదని సృష్టం చేసింది. ఐపిసి చట్టాల ప్రకారం ఓ వ్యక్తి 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికతో శృంగారంలో పాల్గొనడం నేరమని కోర్టు చెప్పింది. ఇందులో బాలిక ఇష్టం ఉన్నా లేకపోయినా దీన్ని నేరంగానే పరిగణించాలని తెలిపింది. అయితే సదరు బాలిక అతడి భార్య అయి ఉండటంతో పాటు అమె వయసు 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే చట్టం నుంచి మినహాయింపు కల్పించాలని కోర్టు సృష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల మారిటల్ రేప్ ను నేరంగా భావించలేమని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.













