అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్?
ప్రముఖ న్యాయవాది, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాల గ్రహీత కేకే వేణుగోపాల్(86) భారత అటార్నీ జనరల్ (ఏజీ)గా నియమితులయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఏజీ ముకుల్ రొహత్గి పదవీ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మూడు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి వచ్చిన వెంటనే తదుపరి ఏజీపై తుది నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ నియామకానికి వేణుగోపాల్ తన అంగీకారాన్ని తెలిపారా అన్న ప్రశ్నకు, ప్రధాని నిర్ణయం తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.













