ఎన్నారైలను ఆధార్ అడుగవద్దు
ఎన్నారైలు (ప్రవాస భారతీయలు), పీఐవోలు (భారత సంతతి వ్యక్తులు), వోసీఐలు (విదేశాల్లో ఉన్న భారతీయులు) తమ బ్యాంకు అకౌంట్లకు, పాన్‌కార్డులకు, ఇతర సేవలకుగాను ఆధార్‌ను లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదని యూఐడీఏఐ తెలిపింది. ప్రభుత్వ సేవలు పొందాలంటే ఆధార్‌ను అడుగుతున్నారంటూ పలువురు ఎన్నారైలు ఫిర్యాదులు చేస్తున్నారని, వాస్తవానికి ఆధార్ గుర్తింపు సంఖ్యను పొందడానికి ఎన్నారైలు, వీఐవోలు, వోసీఐలు అర్హులు కారని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్రాలు, ఇతర సేవాసంస్థలు గుర్తించాలని, వారిని ఆధార్ అడగకూడదని సూచించింది.













