ఆ ఇద్దరు మహిళలకు 24 గంటలు భద్రత కల్పించండి
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఇద్దరు మహిళలకు 24 గంటలూ భద్రతను కల్పించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం కనకదుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. దీంతో అయ్యప్ప సమితి ఆందోళనకారులు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించినందుకు తమకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ ఆ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై స్పందించిన కోర్టు.. ఆ ఇద్దరు మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలంటూ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ సృష్టం చేశారు. 50 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలు శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకోవచ్చు అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ ఇద్దరు మహిళలు అక్కడకు వెళ్లారు. జవనరి 2వ తేదీన కేరళకు చెందిన ఆ ఇద్దరూ స్వామి వారిని దర్శించుకున్నారు.













