శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్
సెక్షన్ 497పై సంచలన తీర్పును ప్రకటించిన సుప్రీంకోర్టు నేడు మరో కీలక తీర్పు ఇచ్చింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించొచ్చని సృష్టం చేసింది. పది నుంచి యాభై ఏళ్ల వయసు మహిళలపై ఉన్న నిషేధాన్ని కోర్తు ఎత్తివేసింది. ఆలయంలోకి మహిళ ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ఆలయ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ఆలయాల్లో లింగవివక్షణ తావులేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
పురుషుల కంటే మహిళలు తక్కువేం కాదని సృష్టం చేసింది. ఓ వైపు దేవతలను పూజిస్తూ మరోవైపు మహిళలపై ఆంక్షలు విధించడం సరికాదని సుప్రీం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ముక్తకంఠంతో తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా మాట్లాడుతూ మహిళలను దేవతలుగా పూజించే దేశం మనదని, వారు దేనిలోనూ తక్కువేమీ కాదన్నారు. మతమనేది ప్రాథమిక జీవనవిధానంలో భాగమేనని దీప్ మిశ్రా చెప్పుకొచ్చారు.













