భారతీయులకు శుభవార్త చెప్పిన సౌదీ యువరాజు
వివిధ దేశాల పర్యటనలో భాగంగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశానికి వచ్చారు. సౌదీ యువరాజు కోసం ప్రొటొకాల్ను సైతం పక్కనపెట్టి స్వయానా ప్రధాని మోదీనే ఎయిర్పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వివిధ విషయాలకు సంబంధించి వారిద్దరూ చర్చించుకున్నారు. చర్చలలో భాగంగా సౌదీ జైళ్లలో ఉన్న భారతీయులను విడుదల చేయాల్సిందిగా మోదీ కోరారు. మోదీ కోరికను అంగీకరించిన సౌదీ యువరాజు సౌదీ జైళ్లలో మగ్గుతున్న 850 మంది ఖైదీలను తక్షణమే విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు లక్షా 75 వేలుగా ఉన్న భారత్ హజ్ యాత్రికుల కోటా సంఖ్యను రెండు లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.













