సౌదీ కింగ్ సంచలన నిర్ణయం
సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకున్నది. కింగ్ సల్మాన్, ఆ దేశ మిలిటరీ కమాండర్లను అకస్మాత్తుగా మార్చేశారు. మిలటరీ చీఫ్‌లను తొలిగిస్తూ, రాత్రికి రాత్రే ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీతో పాటు వైమానిక దళానికి చెందిన అధిపతుల స్థానంలో కొత్త వారిని నియమించారు. కింగ్ సల్మాన్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం గురించి సౌదీ ప్రెస్ పేర్కొన్నది. కానీ సౌదీ చక్రవర్తి ఎందుకు అంత సడన్‌గా ఆ నిర్ణయం తీసుకున్న విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం సౌదీ దళాలు, యెమెన్ యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆకస్మిక నిర్ణయం సంచలనం కలిగించింది. యెమెన్‌లో రెబల్స్ తరపున సౌదీ దళాలు పోరాటం చేస్తున్నాయి. దాదాపు మూడేళ్లుగా యెమెన్‌లో అంతర్యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. సౌదీలో జరిగిన ఆకస్మిక పరిణామాలకు అరబ్ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.













