సౌదీ మహిళలకు గుడ్న్యూస్
సౌదీ మహిళలకు మరో గుడ్న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఇటీవలే సౌదీ మహిళలు డ్రైవింగ్ చేయొచ్చని పేర్కొన్న ప్రభుత్వం, తాజగా మహిళలను స్పోర్ట్స్ స్టేడియాల్లోకి అనుమతించనున్నట్టు కీలక నిర్ణయం ప్రకటించింది. మూడు ప్రధాన స్టేడియాల్లోకి వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మహిళలకు అనుమతించనున్నట్టు ఆ దేశ స్పోర్ట్ గవర్నింగ్ బాడీ జనరల్ స్పోర్ట్ అథారిటీ తెలిపింది. రియాద్, జెద్దా, దమన్ స్టేడియాల్లోకి మహిళలు కూడా వచ్చి మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది. అయితే వీరు కూర్చునేందుకు సీటింగ్ సౌకర్యం ఎలా ఉండబోతుందో ఇంకా తెలుపలేదు.













