బెంగళూరు విద్యార్థి వినూత్న ఆవిష్కరణ
బాటిల్‌ను ముట్టుకోకుండానే చేతిలో శానిటైజర్ పడేలా 14 ఏళ్ల బాలుడు కృష్ణగుప్త వినూత్న ఆవిష్కరణ చేశారు. అతను బెంగళూరులోని ఇన్వెంచర్ అకాడమీలో 8వ తరగతి చదువుతున్నాడు. లెగ్ మైండ్ స్పోమ్ ఎడ్యుకేషన్ ఈవీ3 సాఫ్ట్వేర్ ద్వారా ఈ పరికరాన్ని రూపొందించాడు. ఇది రోబోలా పనిచేస్తుంది. ఓ మోటర్‌ను రోబోకు అనుసంధానించాడు. దీనికి అల్ట్రా సోనిక్ సెన్సార్‌కు అమర్చాడు. 12 సెంటిమీటర్ల దూరం వరకు సెన్సార్ పనిచేస్తుంది. శానిటైజర్ అవసరం అనుకున్నవారు చేయి పెడితే శానిటైజర్ చేతిలో పడుతుంది. దీన్ని వరల్డ్ రోబోటిక్ ఒలింపియాడ్‌లోనూ ప్రదర్శించాడు.













