శుభవార్త చెప్పిన సానియా మీర్జా
భారత టెన్సిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు శుభవార్త చెప్పారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలిపారు. 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడిన ఈ హైదరాబాదీ ఈ అక్టోబరులో తమ తొలి సంతానానికి జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి, కోచ్ ఇమ్రాన్ మీర్జా ధ్రవీకరించారు. సానియా, షోయబ్ ఇద్దరూ తమ చిన్నారరి ఆగమనాన్ని సూచిస్తూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ఫొటోను పోస్ట్ చేశారు. వార్డ్‌రోబ్‌లో ఎడమమైపు సానియా టీ షర్ట్, కుడి వైపు షోయబ్ టీ షర్డ్ ఉండగా మధ్యలో మీర్జా -మాలిక్ పేరిట చిన్నారి డ్రెస్‌ను ఉంచారు. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నెల 12న తన ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్న 31 ఏళ్ల సానియా గత అక్టోబరు నుంచి గాయం కారణంగా టెన్నిస్‌కు దూరంగా ఉంటోంది.













