గౌరవ డాక్టరేట్ ను తిరస్కరించిన సచిన్
ప్రతిష్ఠాత్మక జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తిరస్కరించారు. ఈ ఏడాది డిసెంబర్ 24న డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్టు గతంలో యూనివర్సిటీ ప్రకటించింది. అయితే తాను ఈ డాక్టరేట్‌కు అర్హుడిని కాదని, నైతిక విలువలు కారణగా చూపుతూ వర్సిటీకి సచిన్ లేఖ పంపారు. ఈ విషయానిన వర్సిటీ వైస్ చాన్సలర్ ధ్రువీకరించారు. గతంలోనూ తనకు వివిధ యూనివర్సిటీలు ప్రకటించిన డాక్టరేట్లను తిరస్కరించినట్టు లేఖలో సచిన్ తెలిపారు. సచిన్ స్థానంలో ఒలింపిక్ పతక విజేత మేరికోమ్‌ను డాక్టరేట్‌కు ఎంపిక చేశారు వర్సిటీ అధికారులు. ముంబై యూనివర్సిటీ, ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలు గతంలో సచిన్‌కు డాక్టరేట్లు ప్రకటించగా తిరస్కరించారు.













