ఈ నెల 23 నుంచి అయ్యప్ప దర్శనం!
శబరిమల వరుణుడి అష్టదిగ్బంధంలో కొనసాగుతోంది. పంబా నది ఉధృతంగా ప్రవహిస్తుండంతో శబరిని చేరే దారులు మూసుకుపోయాయి. ఈ నెల 14న నిరుపతరి ప్రత్యేక పూజల సందర్భంగా గుడికి వెళ్లే దారిలేక, ప్రధాన తంత్రి అయ్యప్ప సన్నిధిలో ఉన్న తంత్రితో ఫోన్లో మాట్లాడుతూ ఆ తంతును ముగించేలా చర్యలు తీసుకున్నారు. శబరిమలను చేరేందుకు ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు మార్గాలూ జల దిగ్బంధంలో ఉన్నాయి. 25న ఓనం పండగ నాటికల్లా పంబా నది శాంతించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పండుగ సందర్భంగా 23 నుంచి 27 వరకు భక్తులను శబరి కొండకు అనుమతించే అవకాశాలు ఉన్నాయని శబరిమల ఆలయ పౌర సంబంధాల అధికారి మురళీధరన్ తెలిపారు.













