లాక్డౌన్: కేరళ కీలక ఆదేశాలు
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ను సోమవారం నుంచి పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా తీవ్రత ఆధారంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. కాసర్గడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను రెడ్ జోన్ కింద పరిగణిస్తూ… ఆయా చోట్ల లాక్డౌన్ నిబంధనలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. ఈ నాలుగు జిల్లాల్లో ఎటువంటి రంగాలకు కూడా నిబంధనల నుంచి మినహాయింపు లేదని స్పష్టం చేసింది.













