ఆగస్టులో కొత్త రూ.200 నోటు!
కొత్త రూ.200 నోట్లను ఆగస్టులో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వీటి ముద్రణ ప్రారంభమైందని ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. రూ.200 నోట్లు చెలామణీలోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. మొత్తం సేకరణ ప్రక్రియ, ముద్రణలకు ఇంకా సమయం పట్టొచ్చు. ఆగస్టులో లేదా అంతకంటే ఆలస్యంగా చెలామణీలో రావొచ్చు అని అన్నారు. ప్రారంభ దశలో ఈ నోట్లు ఏటీఎంల్లో లభించవని, కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దశలవారీగా ఏటీఎంల్లో మార్పులు చేస్తామని చెప్పారు.













