కొత్త రూ.500 విడుదల చేసిన ఆర్బీఐ
నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్తగా రూ.500 నోటును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్బీఐ మరో కొత్త రూ.500 నోటును విడుదల చేసింది. ఆ నోటులో ఆంగ్ల ఆక్షరమాల ఎ ను పొందుపరిచింది. ఇటీవల విడుదలైన కొత్త రూ.500 నోట్లు కూడా చెలామణిలో ఉంటాయని ఆర్బీఐ సృష్టం చేసింది. కొత్తగా రిలీజైన 500 నోట్ల డిజైన్లో మార్పులేదని ఆర్బీఐ పేర్కొన్నది. కొత్త సిరీస్లో ఉన్న మహాత్మా గాంధీ బొమ్మతోనే నోటును రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్లో ప్రధాని మోదీ పాత పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఆర్బీఐ కొత్త రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.













