కొత్త వంద రూపాయల నోటు చూశారా?
కొత్త వంద రూపాయల నోటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు పొందిన గుజరాత్లోని రాణి కి వావ్ ఫొటో నోటు వెనుక భాగంగో ముద్రించారు. కొత్త వంద నోటు ఊదా రంగులో ఉంటుంది. ఈ నోటు 66 ఎంఎం I 142 ఎంఎం. వీలైనంత త్వరలోనే ఈ కొత్త వంద నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ వెల్లడించింది. దీనిపై స్వచ్ఛభారత్ లోగో, ఏ సంవత్సరంలో ముద్రించారు తదితర వివరాలు ఉంటాయి. కొత్త వంద నోటు పది రూపాయల నోటు కంటే కొద్దిగా పెద్దగా, పాత వంద నోటు కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. దీవస్లోని ముద్రణా కార్యాలయంలో కొత్త వంద నోట్ల ముద్రణ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నోటులో కొత్తగా కొన్ని మైక్రో సెక్యూరిటీ ఫీచర్లను చేర్చినట్లు ఆర్బీఐ వెల్లడించారు. ఈ ఫీచర్లు అతినీలలోహిత కాంతిలో మాత్రమే కనిపిస్తాయి. పాత వంద నోట్లు కూడా చెలామణీలో కొనసాగుతాయి.













