త్వరలో కొత్త రూ.20 నోటు
త్వరలో కొత్త 20 రూపాయల నోటును విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో కూడిన ఈ మహాత్మా గాంధీ(కొత్త) సిరీస్ నోటు ఆకుపచ్చని పసుపు వర్ణంలో ఉండనుందని తెలిపింది. ఈ నోటు ముందు వైపు మహాత్మా గాంధీ ముఖ చిత్రం, అశోక్ స్థూపం, స్వచ్ఛభారత్ చిహ్నం.. వెనక వైపు ఎల్లోరా గుహల మూలాంశం ముద్రించబడి ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. కొత్త నోటు విడుదల చేస్తున్న ఆర్బీఐ.. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.20 నోట్లు సైతం చెల్లుబాటవుతాయని సృష్టం చేసింది. 2016, నవంబరులో పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం రూ.2,000, రూ.500 నోట్లను విడుదల చేసింది.













