ఏ బ్యాంకునూ మూసివేయం
ఏ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)నూ మూసివేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్పష్టం చేశాయి. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేసే అవకాశం ఉందని సోషల్ మీడియా సహా మీడియాలో సాగుతున్న ప్రచారం వదంతులు మాత్రమేనని పేర్కొన్నాయి. నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) భారంతో కుంగిపోతున్న పీఎస్బీ.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)పై ఆర్బీఐ తక్షణ దిద్దుబాటు చర్యలు (పీసీఏ) తీసుకోవడంతో ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేసే అవకాశం ఉందనే ప్రచారం మొదలయింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.













