భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగొయ్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ అక్టోబరు మూడోతేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగొయ్‌ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. 2019 నవంబరు వరకూ గొగొయ్ ఈ పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ అత్యున్నత పదవిలో నియమితులైన ఈశాన్యరాష్ట్రాలకు చెందిన తొలి న్యాయమూర్తి ఆయనే అవుతారు. ప్రస్తుత చీఫ్‌జస్టిస్ దీపక్ మిశ్ర తన వారసుడిగా గొగొయ్‌ను పేర్కొంటూ ప్రభుత్వానికి సిఫారసు పంపిన దాదాపు వారం రోజుల తర్వాత ఈ నియామకం జరిగింది. జస్టిస్ దీపక్ మిశ్ర అక్టోబర్ ఒకటో తేదీన పదవీవిరమణ చేయనున్నారు. రెండోతేదీన గాంధీజయంతి సందర్భంగా సెలవు. దీంతో మూడోతేదీన జస్టిస్ గొగొయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేస్తారు.













