రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధప్రదేశ్‌లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావు, ఆంధప్రదేశ్‌లో కే.కేశవరావు, తోట సీతారామలక్ష్మి, ఎం.ఎ.ఖాన్, సబ్బరామిరెడ్డి స్థానాలు ఖాలీ కానున్నాయి. మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 13వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ. మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగనుంది. మార్చి 18 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. మార్చి 26న రాజ్యసభ స్థానాలకు పోలింగ్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.













