రాజీవ్ హంతకుల్ని ఏం చేద్దాం?
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడిచిపెట్టాలన్న ప్రతిపాదనపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. ఈ ఏడుగురు దోషులు ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నారు. వీరి జైలు శిక్షను రద్దు చేయాలని తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై తాను కోరుకుంటున్నదేమిటో కేంద్ర ప్రభుత్వం తెలియజేయవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని కోసం మూడు నెలల సమయం ఇచ్చింది. రాజీవ్ హత్య కేసులో దోషులైన పెరారివలన్, మురుగన్, శాంతన్, నళిని, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్లను జైలు నుంచి విడుదల చేయాలనుకుంటున్నట్లు రెండేళ్ల క్రితం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీరంతా 24 సంవత్సరాలపాటు జైలులో ఉన్నందుకు ఈ చర్య తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయం న్యాయస్థానం విచారణలో ఉందంటూ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది.













