రజనీకాంత్ కీలక నిర్ణయం
మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీ నిర్ణయించారు. 2021లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ అని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, మరో పార్టీకి మద్దతు ఇచ్చేందుకు తాను వ్యతిరేకమని సృష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎవరికైనా తన మద్దతు ఉందంటూ ప్రచారం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రచారంలో తన చిత్రాన్ని వాడరాదని, రాష్ట్రంలో నీటి సమస్యను పరిష్కారిస్తారని భావించిన వారికి ప్రజలు ఓటు వేయాలని సూచించారు.













