ముఖాముఖీనా…తృతీయ కూటమినా?
రాజస్థాన్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ముఖాముఖీ పోటీ జరుగుతుంది. కాని ఈ సారి తృతీయ కూటమి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తృతీయ ఫ్రంట్ తెరపైకి రావడంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తామని ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. రాజకీయ సమీకరణలు చకాచకా మారుతున్నాయి. కొత్త ఫ్రంట్ వల్ల తమ ఓటు బ్యాంకు విఛిన్నేమవుతుందని బీజేపీ, కాంగ్రెస్ నేతలకు భయంపట్టుకుంది. ఈ కూటమిలో వామపక్ష పార్టీలు, సమాజ్‌వాదీపార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, జనతాదళ్ సెక్యులర్ పార్టీలు ఉన్నయి. ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీన రాజస్తాన్ అసెంబ్లీలో 200 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వామపక్ష పార్టీలు ఎస్పీ, ఆర్ఎల్డీ , జేడీఎస్ పార్టీలు కూటమిగా అవతరించాయి.
బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఈ కూటమి ఏర్పడింది. మరో విశేషమేమిటంటే జాట్ నేత హనుమాన్ బీనేవాల్ కూడా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 29వ తేదీన ర్యాలీని ఏర్పాటు చేసి కొత్త పార్టీపై ప్రకటన చేస్తానిన జాట్ నేత హనుమాన్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ నెల 28వ తేదీన రాష్ట్రంలో భారీ ర్యాలీ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాలా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీలో తిరుగుబాటునేత , జైపూర్ ఎమ్మెల్యే ఘనశ్యాం తివారీ జాట్ నేతతో టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన భారత్ వాహిని పార్టీని ఏర్పాటు చేశారు. హనుమాన్కు జాట్లలో పట్టుంది. అలాగే తిరుగుబాటు నేత తివారీకి బ్రాహ్మణుల్లో పాపులారిటీ ఉంది. ఇద్దరు చేతులు కలిపితే జాట్, బ్రాహ్మణుల కలయికతో రాజకీయ సమీకరణలను మార్చవచ్చని ఆ భారత్ వాహిని పార్టీ నేతలు చెప్పారు.
జేడీఎస్‌కు చెందిన సీనియర్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ్ రాజస్తాన్‌లో తృతీయ ఫ్రంట్‌ను బలోపేతం చేస్తామని ప్రకటించార. రాజస్థాన్ లోక్తాంత్రిక్ మోర్చాలో సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, సీపీఎం యూనైకటెడ్ పార్టీలు చేరినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఎస్పీ, ఆర్ఎల్డీ, జేడీఎస్ పార్టీలతో ఈ కూటమికి బలం వచ్చిందన్నారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్రనైరాశ్యంతో ఉందని, రైతుల సమస్యల సాధనకు అవిశ్రాంతంగా పోరాడుతున్న వామపక్ష పార్టీలు ఈ సారి త తీయ కూటమిలో చేరి కీలకపాత్ర పోషిస్తున్నట్లు సీపీఎం రైతు సంఘం నేత, అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు ఆమ్ర రామ్ చెప్పారు. అక్టోబర్ 29వ తేదీన కొత్త పార్టీని ప్రకటించనున్న జాట్ నేత హనుమాన్ బెనీవాలాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వామపక్ష పార్టీల నేతలు చెప్పారు.
రాజస్థాన్‌లో ఇంత కాలం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల హవా కొనసాగింది. ఈ రెండు పార్టీల ఆధిపత్యానికిచెక్ పెట్టనున్నట్లు వామపక్ష పార్టీలు నేతలు చెప్పారు. జాట్ నేతలు మహా హుంకార్ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఇప్పటికే బీఎస్పీ పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పార్టీకి 2013 ఎన్నికల్లో 6.9 శాతం ఓట్లు, 2008లో 7.6 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో బీఎస్పీకి 6 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో 200 అసెంబ్లీ సీట్లలో 50 సీట్లలో దళితుల సంఖ్య 20 శాతం ఉంది. బీఎస్పీకి కొన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఏ విధంగానైనా బీఎస్పీతో కూడా జతకట్టి త తీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని వామపక్ష పార్టీలు, ఎస్పీ పార్టీలు భావిస్తున్నాయి. రాజస్థాన్‌లో ఇంతవరకు త తీయ ఫ్రంట్ సక్సెస్ కాలేదు. అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ రెండింటిలో ఏదో ఒక పార్టీని మాత్రమే ప్రజలు ఎంపిక చేసుకుంటున్నారు. ఈ సారి మాత్రం ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా త తీయ ఫ్రంట్ రావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు కంగారు పడుతున్నారు. తమ సంప్రదాయ ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టే విధంగా ఫ్రంట్ ఎత్తుగడలు వేస్తోందంటున్నారు.













