కరోనా కట్టడిలో విఫలం – రాహుల్
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారిని నియంత్రించే క్రమంలో సన్నద్ధతకు మనకు తగినంత సమయం ఉన్నా సరిగ్గా వ్యవహరించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇది చాలా బాధాకరమని, కరోనాను పూర్తిగా కట్టడి చేసే అవకాశం ఉన్నా, సీరియస్‌గా తీసుకుని సన్నద్ధమవడంలో విఫలమయ్యామని రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చప్పట్లు కొట్టాలని పిలుపు ఇచ్చిందన్న ఓ వైద్యుడి ట్వీట్‌ను రాహుల్ ప్రస్తావించారు.













