మొన్న సినిమా… నిన్న దోశ!
ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత రాహుల్ గాంధీ సాధారణ పౌరుడిలా వ్యవహరించడం ప్రారంభించారు. బిహార్లోని బసంత్ విహార్ సమీపంలోని మౌర్యలోక్ అనే ఓ సాధారణ రెస్టారెంట్లోకి వెళ్లారు. ఇది చూసిన రెస్టారెంట్ నిర్వాహకులు, ప్రజలు అవాక్కయ్యారు. మౌర్యలోక్ రెస్టారెంట్ దక్షిణాది వంటకాలకు ఎంతో ఫేమస్. అందులో దోశను అర్డర్ చేసి సామాన్య పౌరుడిలా అనుచరులతో ముచ్చటిస్తూ దోశను ఆరగించారు. ఆ తరువాత కాఫీ తాగారు. రెస్టారెంట్ సిబ్బందితో పాటు స్థానికులు సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. సుశీల్ కుమార్ మోడీ వేసిన పరువు నష్టం దావా కేసును విచారణకు హాజరై.. బెయిల్ పొందిన తరువాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు.













