గూగుల్ ట్రెండ్స్ లో కుమారస్వామి భార్య
కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ, నెట్టింట ఆయన భార్య, తమిళ, కన్నడ భాషల్లో 32 సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధిక గురించి తెగ వెతికేస్తున్నారు. గూగుల్ ట్రెండింగ్లో రాధికా కుమారస్వామి ఇప్పుడు టాప్ లో ఉన్నారు. తనకన్నా 17 సంవత్సరాలు చిన్నదైన రాధికను 2005లో పరిచయం చేసుకున్న కుమారస్వామి, ఆపై 2006లో పెళ్లి చేసుకున్నారు. ఆపై నాలుగేళ్ల తరువాత రాధిక స్వయంగా తాను కుమారస్వామిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపి సంచలనమే రేపింది. కాగా, వీరిద్దరికీ ఇది రెండో వివాహమే కావగం గమనార్హం. 1986లో అనితను వివాహం చేసుకున్న కుమారస్వామి, ఆ తరువాత రాధికకు దగ్గరయ్యారు. 2002లో రతన్ కుమార్ ను పెళ్లాడిన రాధిక, ఆపై భేదాభిప్రాయాలతో అతనికి దూరమయ్యారు. ప్రస్తుతం రాధిక సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు.













