పీవీ సింధుకు జాక్ పాట్
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణీ పీవీ సింధు జాక్పాట్ కొట్టింది. చైనాకు చెందిన ప్రముఖ క్రీడాపరికరాల సంస్థ లీనింగ్తో రూ.50 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. బ్యాడ్మింటన్ చరిత్రలో ఇది విలువైన ఒప్పందం. స్పాన్సర్షిప్, క్రీడాసామాగ్రితో కలిసి దీని విలువ రూ. 50 కోట్లు. పుమాతో విరాట్ కోహ్లీ చేసుకునన ఒప్పందానికి ఇది సమానం అని సన్లైట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మహేందర్ కపూర్ తెలిపారు. లీ నింగ్తో ఒప్పందం చేసుకోవడం సింధుకు ఇది రెండోసారి. 2014-15లో రెండేళల కాలానికి రూ.1.25 కోట్లను చెల్లించింది.













