పద్మభూషణ్ అవార్డుకు పీవీ సింధు పేరు సిఫారసు
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పూసర్ల వెంటక సింధు పేరును దేశ మూడో అత్యున్నత పురస్కారానికి సిఫార్సు చేశారు. ఆమె పేరు పద్మభూషణ్ అవార్డుకు సిఫార్సు చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు 2వ స్థానంలో కొనసాగుతోంది. తాజాగా సింధు కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలుచుకున్నది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లోనూ తన సత్తా చాటి రజత పతకాన్ని దక్కించుకుంది. ఇటీవల బ్యాడ్మింటన్‌లో ఆమె సాధిస్తోన్న వరుస విజయాలను గుర్తించిన కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సింధు పేరు పద్మభూషణ్‌కు ప్రతిపాదించింది. సింధు 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. సింధును పద్మభూషణ్ పురస్కారానికి కేంద్ర క్రీడా శాఖ సిఫారసు చేయడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













