చరిత్ర సృష్టించిన పీవీ సింధు
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. లైట్ కంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్సీఏ) తేజస్‌లో ఆమె ఇవాళ విహరించింది. యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న ఏరో ఇండియా షోలో ఆమె తేజస్ యుద్ద విమానాన్ని ఎక్కింది. కో పైలట్‌గా షట్లర్ సింధు తేజస్‌లో ప్రయాణించింది. ఏరో ఇండియా షోలో ఇవాళ మహిళా దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదీ ప్లేయర్‌కు తేజస్‌లో విహరించే అరుదైన గౌరవం దక్కింది. గత రెండు రోజుల క్రితమే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా తేజస్‌లో విహరించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్‌కు రెండు రోజుల క్రితమే ఆపరేషన్ క్లియరెన్స్ దక్కింది. ఈ యుద్ధ విమానాన్ని త్వరలో భారత వైమానిక దళంలోకి ఇండక్ట్ చేయనున్నారు.













