క్యాన్సర్ ఆసుపత్రికి 25 లక్షల విరాళం ఇచ్చిన పీవీ సింధు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంటక సింధు బంజారా హిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. ఆసుపత్రి వర్గాలవారు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ప్రముఖ టీవీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు అందులో రూ.25 లక్షలు గెలుపొందారు. ఆ మొత్తాన్ని క్యాన్సర్ రోగుల సహాయార్థం బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు ఆమె ముందుగానే ప్రకటించారని వెల్లడించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని క్యాన్సర్‌పై జరిపే పోరాటంలో మరికొందరు భాగస్వాములు అవుతారని తాము ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.













