ఈ విజయం మోదీకి అంకితం
తెలుగు తేజం, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తాజాగా తాను సాధించిన విజయాన్ని ప్రధాని మోడీకి అంకితమిచ్చింది. 22 ఏళ్ల సింధు ప్రపంచ ఛాంపియన్ ఒకుహరను మట్టికరిపించి కొరియా ఓపెన్ సిరీస్ టైటిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ టైటిల్ చేజిక్కించుకున్న తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ ద్వారా సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచిన సింధుకు అభినందనలు. ఆమె విజయం దేశానికి గర్వకారణం అని మోడీ పేర్కొన్నారు. మోడీ ట్వీట్‌కు పీవీ సింధు స్పందించింది. ప్రధాని మోడీ పుట్టినరోజు నాడు సాధించిన ఈ విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నాను. ఏ మాత్రం అలసిపోకుండా దేశానికి ఆయన అందిస్తోన్న సేవలు చిరస్మరణీయం అని సింధు ట్విటర్లో పేర్కొంది.













